ఢిల్లీ 21 ఫిబ్రవరి ఢిల్లీలో రైతులు మళ్లీ పోరుబాట పడుతున్నారు. మొత్తం 23 వాణిజ్య పంటలకు కనీస మద్దతు ధర గ్యారెంటీ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ ఛలో చేపట్టేందుకు రెడీ అయ్యారు. శాంతియుతంగా దేశ రాజధానికి పాదయాత్ర కొనసాగిస్తామని రైతులు చెబుతున్నప్పటికీ.. అందుకు ఏమాత్రం అనుకూల పరిస్థితులు కనిపించట్లేదు.. రైతులను అడ్డుకునేందుకు మూడు అంచెల వ్యవస్థతో పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. దీంతో ఢిల్లీ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
