తెలంగాణ : హైదరాబాద్ : 13ఫిబ్రవరి
కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి దోచుకుందని సీనియర్ కాంగ్రెస్ నేత కోదండరెడ్డి ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉద్యోగాలు.. గ్యారంటీలు అమలు చేస్తాం అన్నామని ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామన్నారు. ధాన్యంకి ఐదు వందల బోనస్ ఎక్కడా..అని ఓ మాజీ మంత్రి అడుగుతున్నారన్నారు. 2600 క్విటాలుకు ధాన్యం అమ్ముతున్నారు రైతులు అని, Msp కంటే తక్కువ వస్తే బోనస్ ఇస్తాం అన్నామన్నారు. Msp రైతులకు వస్తుందని, రైతు రుణమాఫీ మీలాగా మేము చేయమన్నారు. రుణమాఫీ విషయంలో.. మాకే అనుభవం ఉందని, ఏకకాలంలో మాఫీ చేసిన చరిత్ర మాది అని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు కూడా ఒకే సారి రుణమాఫీ చేస్తామన్నారు. అప్పుల వివరాలు సేకరించి పనిలో ఉన్నది మా ప్రభుత్వమని కోదండరెడ్డి అన్నారు.
