దెందులూరు11 ఫిబ్రవరి : టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పెనుబోయిన మహేష్ యాదవ్ను దెందులూరు పోలీసులు అరెస్టు చేసి ఠాణాకు తరలించారు. టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడి చేపట్టారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 23 వేలకుపైగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయకుండా సీఎం జగన్ నిరుద్యోగులను మోసం చేస్తున్నారంటూ ఆరోపించారు. ఐదేళ్ల నుంచి జగన్ ప్రభుత్వం ఒక్క ఉపాధ్యాయ పోస్టును భర్తీ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో 6100 ఉపాధ్యాయ నియామకాలకు నోటిఫికేషన్ను విడుదల చేయడం దారుణమన్నారు. నిరుద్యోగ యువత, విద్యార్థులు జగన్రెడ్డిని గద్దె దించడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు.
