చెన్నై : 7ఫిబ్రవరి ( హింస) తమిళనాడులోని ఊటీలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో భవనం కూలి ఆరుగురు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు తెలుస్తోంది.
