అమరావతి,7 ఫిబ్రవరి:(హిం.స) ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికారంలోకి రావడమే లక్ష్యంగా టీడీపీ – జనసేన కూటమి కార్యాచరణను రూపొందిస్తోంది.
అయితే టికెట్‌ల విషయంలో మాత్రం ఇరు పార్టీల అభ్యర్థుల్లో కాస్త భయం కనపడుతున్నట్లు సమాచారం. పొత్తులో భాగంగా రెండు పార్టీల్లో ఏ పార్టీ అభ్యర్థికి టికెట్ దక్కుతుందో అనే టెన్షన్ ప్రతీఒక్కరిలో ఉంది. సీట్ల సర్దుబాటుపై ఇరు పార్టీల అధినేతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ టీడీపీ – జనసేన పార్టీ నేతల్లో నెలకొంది.
