ఢిల్లీ : జనవరి 29( హింస) ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కొత్త సోలార్ పాలసీని ప్రకటించారు. సౌర విద్యుత్తు 2024కు చెందిన విధివిధానాలను ఆయన వెల్లడించారు. ఇప్పటి వరకు 2016కు చెందిన సోలార్ పాలసీ అమలులో ఉందన్నారు. దేశంలోనే ఆ విధానం అత్యంత క్రియాశీలకమైందన్నారు. ఢిల్లీలో ఇప్పటి వరకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు ఇస్తున్నామన్నారు. 400 యూనిట్లు ఖర్చు చేసిన వారికి సగం ఛార్జీలు వసూల్ చేస్తున్నామన్నారు. ఇక 400 యూనిట్లు దాటిన వారి వద్ద నుంచి మొత్తం బిల్లును వసూల్ చేస్తున్నట్లు చెప్పారు.
