దిల్లీ,24,జనవరి (హిం.స) కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ నేతృత్వంలో అస్సాంలో జరుగుతున్న భారత్ జోడో న్యాయ యాత్ర)లో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ భద్రతపై ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా( Amit Shah)కు లేఖ రాశారు. ఇటీవల చోటుచేసుకున్న భద్రతాపరమైన లోపాలను దానిలో ఎత్తిచూపారు.
భారత్ జోడో న్యాయ యాత్ర గువాహటి నగరంలోకి ప్రవేశించకుండా పోలీసులు మంగళవారం భారీగా బారికేడ్లను అడ్డుపెట్టారు. కాంగ్రెస్ కార్యకర్తలు వీటిని తోసుకుని ముందుకు దూసుకెళ్లారు. దీంతో రెండు వర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుని.. ఉద్రిక్తతకు దారితీసింది. హింసాత్మక ఘటనలు, రెచ్చగొట్టడం, ప్రజా ఆస్తులకు నష్టం కలిగించడం, పోలీసు సిబ్బందిపై దాడి వంటి చర్యలకు కారణమయ్యారంటూ రాహుల్, ఇతర నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
