అమరావతి, జనవరి 24(హిం.స): రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం కొత్తగా మరో రూ.1100 కోట్ల అప్పు తెచ్చింది. రిజర్వు బ్యాంకు వేలంలో రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలను విక్రయించి ఈ అప్పు తెచ్చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు కేవలం మంగళవారం తెచ్చిన అప్పులే రూ.62,000 కోట్లకు చేరుకున్నాయి. వీటికి కార్పొరేషన్ అప్పులు దాదాపు రూ.25,000 కోట్లు అదనం. ఇవి కాకుండా ఎంప్లాయిస్ కటింగ్స్, నాబార్డు, ఈఏపీ, కేంద్రం ఇచ్చే రుణాల ద్వారా ఇంకో రూ.15,000 కోట్లు అప్పు చేశారు.
