దిల్లీ,22,జనవరి (హిం.స) అయోధ్య బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి బీజేపీ సీనియర్ నేత ఎల్కేఅద్వానీ హాజరుకాలేదు. అయోధ్య రామమందిర పోరాటంలో ఆయన రథసారథిగా నిలిచారు. అయితే అయోధ్యలో విపరీతమైన చలి గాలుల కారణంగా ఆయన ఆరోగ్యం దృష్ట్యా ప్రాణ ప్రతిష్ఠకు హాజరుకాలేదని తెలుస్తోంది. ఆయనతోపాటు బీజేపీకి చెందిన మరో సీనియర్ నేత మనోహర్ జోషి కూడా ఈ కార్యక్రమానికి రావట్లేదు.
వాతావరణం చల్లగా ఉండటంతో ఇరువురు నేతల వయసును పరిగణలోకి తీసుకుని అయోధ్యకు రావొద్దని సూచించాం. దీనికి వారు అంగీకరించారు అని రామాలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ గతంలో తెలిపారు. అయితే ఇద్దరు నేతలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతారని వీహెచ్పీ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ వెల్లడించారు.
హిందూస్తాన్ సమాచార్ /నాగరాజ్
