









అయోధ్య:22 జనవరి (హిం.స( ఇన్నాళ్లూ తాత్కాలిక మందిరంలో ఉన్న పాత రామ్‌లల్లా మూర్తి సోమవారం గర్భగుడిలో కొత్తగా ప్రతిష్ఠించనున్న బాలరాముడి విగ్రహం ముందే ఉండేలా ఏర్పాటు చేయనున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు కోశాధికారి గోవింద్‌దేవ్ గిరి తెలిపారు. ‘‘పాత విగ్రహం అయిదారు అంగుళాల ఎత్తు ఉంది. 25 – 30 అడుగుల దూరం నుంచి అది స్పష్టంగా కనిపించదు. అందుకే 51 అంగుళాల కొత్త మూర్తి అవసరమైంది’’ అని చెప్పారు. అయోధ్య రామమందిర నిర్మాణానికి ఇప్పటివరకు రూ.1,100 కోట్లకు పైగా ఖర్చయినట్లు వెల్లడించారు. మందిర నిర్మాణం 2024లోనే పూర్తి చేస్తామని, మొత్తం పనులు పూర్తి చేసేందుకు మరో రూ.300 కోట్లు అవసరమవుతాయని చెప్పారు. ముగ్గురు శిల్పులు చెక్కిన విగ్రహాల్లో మైసూరుకు చెందిన అరుణ్ యోగిరాజ్ రూపొందించిన ప్రతిమను ఎంపిక చేయడానికి చాలా తర్జనభర్జన పడాల్సి వచ్చిందని.. ఎంతో చక్కగా ఉన్న మిగతా రెండింటిని కూడా ఆలయంలోనే ఉంచుతామన్నారు.
హిందూస్తాన్ సమాచార, రాజీవ్
