



అయోధ్య: 21 జనవరి (హిం.స)రామ మందిర ప్రారంభోత్సవానికి, ఆ తర్వాత దర్శనానికి వచ్చే భక్తులకు ఉచిత ఆహారాన్ని అందించేందుకు వీలుగా సామాజిక వంటశాలలు ఏర్పాటయ్యాయి.
నిహాంగ్ సింగ్స్, ఇస్కాన్ వంటి సంస్థలు ఈ ఏర్పాట్లను చేశాయి. రాం కీ రసోయ్ నుంచి లంగర్ వరకూ వంటశాలలను ఏర్పాటు చేశాయి. అయోధ్యలోని ప్రతి వీధిలో ఇవి ఏర్పాటయ్యాయి. కిచిడీ, ఆలూ పూరీ, కధీ చావల్, ఆచార్, పాపడ్‌లను భక్తులను అందించనున్నారు.
ప్రస్తుతం చలి తీవ్రత అధికంగా ఉండటంతో వేడి టీనీ భక్తులకు ఇస్తారు. బాబా హర్జీత్‌సింగ్ రసూల్‌పుర్ నేతృత్వంలో నిహాంగ్ సిక్కుల గ్రూపు శుక్రవారం అయోధ్య చేరుకుంది. ఛార్‌ధామ్ మఠ్‌లో వారు 2 నెలలపాటు లంగర్‌ను ఏర్పాటు చేసి ఆహారాన్ని అందించనున్నారు. పట్నాకు చెందిన మహావీర్ ఆలయ ట్రస్టు రోజుకు 10,000 మందికి ఆహారాన్ని అందించేలా రాం కీ రసోయ్ వంట గదిని సిద్ధం చేసింది. ఇస్కాన్ మధ్యాహ్న భోజనాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేసింది. రోజుకు 5,000 మందికి ఆహారాన్ని అందించనుంది.
హిందూస్తాన్ సమాచార, రాజీవ్
హిందూస్తాన్ సమాచార రాజీవ్
