తెలంగాణ 20 జనవరి (హిం.స) దక్షిణాదిలో కర్ణాటక తర్వాత బలమైన పార్టీగా ఉన్న తెలంగాణపై బీజేపీ చాలా ఆశలు పెట్టుకుంది.
గత ఎన్నికల్లో నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకున్న బీజేపీ.. ఈసారి కనీసం 10 సీట్లు గెలుచుకోవాలనే లక్ష్యంతో ఉంది. ఈ నేపథ్యంలో ప్రజల్లోకి బలంగా వెళ్లాలని నిర్ణయించుకుంది.
రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ దక్షిణాది రాష్ట్రాలపై దృష్టి సారించింది. ప్రధాని నరేంద్రమోడీ దక్షిణాదిలో సెటిల్ అయ్యారని, కేరళ నుంచే ప్రచారాన్ని ప్రారంభించనున్నారనే చర్చ సాగుతోంది. దక్షిణాదిలో కర్ణాటక తర్వాత బలమైన పార్టీగా ఉన్న తెలంగాణపై బీజేపీ చాలా ఆశలు పెట్టుకుంది.
హిందూస్తాన్ సమాచార, రాజీవ్
