



గద్వాల అర్బన్ : 20 జనవరి (హిం.స)పుట్టిన రోజు వేడుకలకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు కారు విభాగినిని (డివైడర్) ఢీకొని ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. గద్వాల పురపాలక సంఘం పరిధిలోని జమ్మిచేడు వద్ద శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. గద్వాల పట్టణానికి చెందిన ఓ వైద్యుని కుమార్తె పుట్టినరోజు వేడుకలకు హాజరై తిరుగు ప్రయాణంలో ఎర్రవల్లికి వెళుతుండగా కారు ప్రమాదానికి గురైంది. కారులో ప్రయాణిస్తున్న వారిని నరేష్ (23) మల్దకల్, పవన్‌కుమార్ (28)పెబ్బేరు, ఆంజనేయులు (50) గద్వాలకు చెందిన వారిగా గుర్తించారు. వీరంతా గద్వాలలోని ఓ ఆసుపత్రిలో ఉద్యోగులు. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకునేటప్పటికి ముగ్గురు ప్రాణాలొదిలారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం గద్వాల జిల్లా ఆసుపత్రికి తరలించారు.
హిందూస్తాన్ సమాచార, రాజీవ్
