



కర్నూలు18 జనవరి (హిం.స) టీడీపీ నేతలపై ఆంధ్రప్రదేశ్ పోలీసుల కక్షసాధింపు కార్యక్రమాలు ఎక్కువ అయ్యాయి. టీడీపీలో చేరారనే కారణంతో పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు.
కర్నూలు జిల్లా పత్తికొండలో ఈ ఘటన జరిగింది. పత్తికొండ తెలుగుదేశం పార్టీ ఇంచార్జీ కేఈ శ్యామ్ బాబు సమక్షంలో నిన్న 20 కుటుంబాలు టీడీపీలో చేరాయి. టీడీపీలో చేరారని ఆ 20 కుటుంబాలను గురువారం (ఈ రోజు) పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఆ కారణంగా తమను పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారని ఆ కుటుంబాలు చెబుతున్నాయి.
హిందూస్తాన్ సమాచార, రాజీవ్
