దిల్లీ,18,జనవరి (హిం.స) మద్యం కుంభకోణం కేసు విచారణకు హాజరుకావడం లేదని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు సమాచారం ఇచ్చారు. త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల దృష్ట్యా తాను గోవా పర్యటనకు వెళుతున్నట్లు దానిలో పేర్కొన్నారు.
దిల్లీలో నేటి మధ్యాహ్నం విద్యాశాఖ కార్యక్రమానికి కేజ్రీవాల్ హాజరుకానున్నారు. పార్టీ కార్యకర్తల సమావేశంతో పాటు బహిరంగ ర్యాలీలో ఆయన పాల్గొననున్నారు. గోవాలో ముందస్తుగా నిర్ణయించిన పార్టీ కార్యక్రమాలు ఉండటంతో విచారణకు హాజరు కాలేకపోతున్నట్లు కేజ్రీవాల్ తెలిపారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్తో కలిసి మూడు రోజుల పాటు అక్కడ పర్యటించనున్నారు.
మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే ఈడీ మూడుసార్లు సమన్లు జారీ చేసినా.. కేజ్రీవాల్ విచారణకు హాజరుకాలేదు. ఈ నోటీసులు చట్టవిరుద్ధమని.. రాజకీయ ప్రేరేపితమని ఆయన ఆరోపించారు.
హిందూస్తాన్ సమాచార్ /నాగరాజ్
