



తిరుమల,18 జనవరి (హిం.స) శ్రీవారి భక్తుల సౌకర్యార్థం ఏప్రిల్‌కు సంబంధించిన ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేయనుంది.
సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన ఆర్జిత సేవల ఆన్‌లైన్ లక్కీడిప్ కోసం ఈ నెల 18న గురువారం ఉదయం పది నుంచి 20వ తేదీ ఉదయం పది గంటల వరకు నమోదు చేసుకోవచ్చు.
లక్కీడిప్ టికెట్లు పొందిన భక్తులు ఈ నెల 22న మధ్యాహ్నంలోపు రుసుం చెల్లించి వాటిని ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.
హిందూస్తాన్ సమాచార, రాజీవ్
