దిల్లీ,17,జనవరి (హిం.స) చలి కారణంగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, జమ్ముకశ్మీర్ రాష్ట్రాల్లో ఉదయం వేళల్లో దట్టంగా పొగమంచు కమ్ముతోంది.
పొగ మంచు దట్టంగా ఉండటం వల్ల రైళ్లు, విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమానాలు రెండు, మూడు గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి.. ఉదయం పూట వెళ్ళాల్సిన కొన్ని రైళ్లు పూర్తిగా రద్దయినట్లు తెలుస్తుంది.. దట్టమైన పొగమంచు కారణంగా దాదాపు 120 విమానాలు (దేశీయ మరియు అంతర్జాతీయ) రాకపోకలు మరియు నిష్క్రమణలను ప్రభావితం చేసే విమాన కార్యకలాపాలలో ఆలస్యం అవుతుందని అధికారులు ప్రకటించారు
హిందూస్తాన్ సమాచార్ /నాగరాజ్
