








ముంబై 10 జనవరి (హిం.స): బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో మార్పులు, చేర్పులు సర్వసాధారణం. నేడు బంగారం ధరలు అత్యంత స్వల్పంగా తగ్గాయి. అది అసలు పరిగణలోకి తీసుకోగలిగినంత మేర అయితే లేదు కానీ పెరగకపోవడం మాత్రం ఆనందాన్ని కలిగిస్తోంది. ఇక వెండి కిలోపై అత్యంత స్వల్పంగా పెరిగింది. కిలో వెండిపై రూ.200 మేర పెరిగి రూ.76,600కి చేరింది. నేడు 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.100 మేర తగ్గి రూ.62,950కి చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.100 మేర తగ్గి రూ.57,700కి చేరింది.
హిందూస్తాన్ సమాచార, రాజీవ్
