దిల్లీ, 09,జనవరి (హిం.స)అయోధ్యలో రాంలాలా విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం సమీపిస్తున్న తరుణంలో భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులలో ఉత్సాహం పెరుగుతోంది. అయితే, ఈ చారిత్రాత్మక సందర్భాన్ని తమ తమ దేశాల్లో జరుపుకోవడానికి సన్నాహాలు చేస్తున్నాయి. ప్రపంచ విశ్వ హిందూ పరిషత్ విభాగం ఉన్నత అధికారుల తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం 50 కంటే ఎక్కువ దేశాల్లో 500 కంటే ఎక్కువ విభిన్న సామూహిక ఆచారాలను నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.
జనవరి 22వ తేదీన అమెరికాలో 300, బ్రిటన్లో 25, కెనడా, ఆస్ట్రేలియాలో 30, మారిషస్లో 100, జర్మనీలో 10కి పైగా ఉత్సవాలు నిర్వహించనున్నారు. కొన్ని దేశాల్లో హిందువుల జనాభా తక్కువగా ఉండగా.. ఐర్లాండ్ లాంటి దేశాల్లో మాత్రం ఒక్క ఈవెంట్ మాత్రమే నిర్వహిస్తున్నారు. అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో కూడా ఊరేగింపులు కొనసాగుతున్నాయి
హిందూస్తాన్ సమాచార్ /నాగరాజ్
