దిల్లీ,0 5 జనవరి (హిం.స) హిందూ మహా సముద్రంలో మరో నౌక హైజాక్కు గురైంది. సోమాలియా తీరం)లో ఈ ఘటన చోటుచేసుకుంది. లైబీరియా జెండాతో ఉన్న ఈ నౌకలో దాదాపు 15 మంది భారతీయ సిబ్బంది ఉన్నట్లు అధికారులను ఉటంకిస్తూ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ ఘటన గురించి సమాచారం అందిన వెంటనే భారత నౌకాదళం స్పందించింది.
షిప్లో పరిస్థితుల్ని అంచనా వేయడానికి సిబ్బందితో కమ్యూనికేషన్ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. అరేబియా సముద్రంలో షిప్ హైజాకింగ్ ప్రయత్నాలకు సంబంధించి ఇండియన్ నేవీ వేగంగా స్పందించింది. ఈ నౌకలో గురువారం సాయంత్రం ఐదు నుంచి ఆరుగురు సాయుధుల ఉనికి ఉన్నట్లు సందేశం అందింది.
సోమాలియా తీరంలో సముద్ర దొంగలు వాణిజ్య ఓడలను హైజాక్ చేసి, వాటిని విడిపించుకునేందుకు సంబంధిత యాజమాన్యం, దేశాలను డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. 2008 నుంచి 2013 మధ్య ఈ పెరెట్స్ దాడులు పెరిగాయి. అయితే ఇండియన్ నేవీతో సహా మల్టీ-నేషనల్ మారిటైమ్ టాస్క్ఫోర్స్ సమిష్టి ప్రయత్నాల వల్ల ఈ దాడులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి.
హిందూస్తాన్ సమాచార్ /నాగరాజ్
