తెలంగాణ : హైదరాబాద్ : జనవరి 5( హింస)
ఇస్రో చీఫ్ శ్రీధర పనికర్ సోమనాథ్‌కు తెలంగాణ జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ (జేఎన్‌టీయూ) గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. వర్సిటీ 12వ స్నాతకోత్సవం సందర్భంగా దీన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు వైస్ ఛాన్సలర్ ప్రొ.కట్టా నరసింహా రెడ్డి తెలిపారు. నేడు నిర్వహించనున్న స్నాతకోత్సవానికి సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. రాష్ట్ర గవర్నర్, JNTU ఛాన్సలర్ తమిళిసై సౌందరరాజన్ అధ్యక్షత వహిస్తారు అనంతరం డాక్టర్ సోమనాథ్ స్నాతక ప్రసంగం చేస్తారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన 54 మంది విద్యార్థులు, పరిశోధకులకు బంగారు పతకాలు, డిగ్రీ పూర్తి చేసిన 88,226 మంది ఇంజినీరింగ్, ఎంటెక్ విద్యార్థులకు పట్టాలు అందజేయనున్నట్లు తెలిపారు.విదేశీ యూనివర్సిటీలతో ఒప్పందాలు. జేఎన్ టీయూలో బీటెక్ చదువుతున్న విద్యార్థులు ఐదేళ్లలోపు డ్యూయల్ డిగ్రీ పొందేలా అమెరికా సహా ఇతర దేశాల్లోని పది యూనివర్సిటీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని వివరించారు.
పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార
