







విజయవాడ05 జనవరి (హిం.స): రానున్న ఎన్నికల్లో విజయవాడ ఎంపీ టికెట్‌ను వేరే వ్యక్తికి ఇవ్వాలని టీడీపీ నిర్ణయించింది.
ప్రస్తుత ఎంపీ కేశినేని నానికి ఆ సమాచారాన్ని పార్టీ అధిష్ఠానం చేరవేసింది. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. పార్టీ అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని శిరసావహిస్తానని తెలిపారు.
హిందూస్తాన్ సమాచార, రాజీవ్
