ఢిల్లీ,03,జనవరి,(హిం.స)అస్సాం రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గోలాఘాట్లోని డెర్గావ్ సమీపంలోని బలిజం ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొనడంతో 12 మంది మృతి చెందారు. బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మరో 25 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
గోలాఘాట్ నుంచి టిన్సుకియా వైపు వెళుతున్న బస్సు.. అదే మార్గంలో ఎదురుగా వస్తున్న బొగ్గు లోడుతో వస్తున్న ట్రక్కును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారినిదేర్గావ్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయాలపాలైన వారిని జోర్హాట్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్కు తరలించారు. ఈ ప్రమాదంలో రెండు వాహనాల డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
హిందుస్థాన్ సమాచార నాగరాజ్
