ఢిల్లీ :03 జనవరి (హిం.స) రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి 30-35 స్థానాలు వస్తాయని గతంలో తాను చెప్పానని, ఇప్పుడు ఆ సంఖ్య 20 లోపునకు దిగజారనుందని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు.
ఆయన విలేకర్లతో మంగళవారం మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘షర్మిల కాంగ్రెస్‌లో చేరిన తర్వాత సుమారు 40 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌వైపు వెళ్లే అవకాశం ఉంది. నిన్న మొన్నటివరకు సరైన అభ్యర్థులు లేని కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు 7% ఓట్లు సాధించే స్థాయికి చేరబోతోంది. వైకాపాకు ఇప్పటివరకు దన్నుగా ఉన్న ముస్లిం, క్రిస్టియన్ ఓట్లు కాంగ్రెస్‌వైపు మళ్లనున్నాయి. వైకాపా గెలుపులో కీలకపాత్ర పోషించిన క్రిస్టియన్లు ఇక షర్మిల వైపు చూస్తారు. ఆమె భర్త అనిల్ గతంలో తన బావ విజయానికి కృషిచేశారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచారంలో అనిల్ కీలకపాత్ర పోషించనున్నారు.
హిందూస్తాన్ సమాచార, రాజీవ్
