అనంతపురం, 31 డిసెంబర్ (హిం.స)
భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అనంతపురం జిల్లా కమిటీని డీఆర్ సమక్షంలో ఎన్నుకున్నారు.
ఈ మేరకు జిల్లా అధ్యక్షురాలిగా కలెక్టర్ గౌతమి, ఉపాధ్యక్షులుగా జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్, డీఆర్ఎ గాయత్రిదేవి, జిల్లా చీఫ్ కమిషనర్ డీఈఓ నాగరాజును ప్రకటించారు. జిల్లా కార్యదర్శిగా బి. బొమ్మయ్య, కోశాధికారిగా హిమగిరి వరప్రసాద్ ఎన్నికయ్యారు.
భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ సంస్థ వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొని క్రమశిక్షణకు మారుపేరుగా నిలుస్తోందని కలెక్టర్ గౌతమి అన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ గౌతమి మాట్లాడుతూ భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ సంస్థకు ఎన్నికలు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయని, ప్రతి పాఠశాల సభ్యత్వం కోసం 300 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. స్కౌట్స్ అండ్ గైడ్స్లో చేరిన ప్రతి విద్యార్థి విద్యార్థినులు మంచి క్రమశిక్షణతో పాటు ఉన్నత స్థాయి విద్య అభ్యసించే అవకాశం ఉందని, దీంతోపాటు చదువు, సంస్కారం అలవడుతుందని తెలిపారు. క్రమశిక్షణ ఎక్కడ ఉంటుందో అక్కడ మంచి వ్యక్తిత్వం గల లక్షణాలు కలిగిన విద్యార్థులుగా తీర్చబడతారని చెప్పారు. భారత స్కౌట్ అండ్ గైడ్స్ విద్యార్థులకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుందని అన్నారు. ఏదేని విపత్తులు సంభవించినప్పుడు స్కౌట్ విద్యార్థులు ముందుండి సేవ కార్యక్రమాలు నిర్వహిస్తారని చెప్పారు. ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ట్రోప్ ప్రారంభించాలని కమిటీ ప్రతిపాదించిందని, స్కౌట్లో చేరిన విద్యార్థులకు ఐదు శాతం రిజర్వేషన్ ఉంటుందన్నారు. స్కౌట్ మాస్టర్ మాట్లాడుతూ స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యక్రమాలు నిర్వహించాలంటే చాలా ఖర్చుతో కూడిన పని అని, ముఖ్యంగా ఆగస్టు 15 స్వాతంత్రదినోత్సవం, జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్కౌట్ విద్యార్థులకు నిర్వహణ ఖర్చు రూ. 40 వేల నుంచి 50 వేల వరకు అవుతుందన్నారు.
హిందూస్తాన్ సమాచార్,సంధ్యా
