ఢీల్లీ, 30 డిసెంబర్ (హిం.స)
అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ మహాత్సవానికి అంగరంగ వైభవంగా ముస్తాబవుతోంది. నూతన సంవత్సరం జనవరి 22న అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగునుంది. ఈ ఆలయ నిర్మాణంతో దాదాపు 600 ఏళ్ల నాటి కల సాకారమైందని కొందరు హిందూ భక్తులు అభిప్రాయపడుతున్నారు.
ఈ మహాత్సవాన్ని ప్రత్యక్షంగా, పరోక్షంగా తిలకించేందుకు యావత్ భారతం ఎదురు చూస్తోంది. ఈ క్రమంలోనే పలు పార్టీల ముఖ్య నేతలకు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, కొందరు సినీ ప్రముఖులకు ప్రత్యేక ఆహ్వానాలు అందాయి.
ఇందులో ప్రతిపక్షనేతలు సోనియా, మల్లిఖార్జున ఖార్గే, లోక్ సభ సభ్యులు అధిర్ రంజన్ కూడా ఉన్నారు.
హిందూస్తాన్ సమాచార్,సంధ్యా
