ఆంధ్రప్రదేశ్ : అమరావతి: డిసెంబర్27( హింస)
కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌పై ఫోకస్ పెడుతోంది. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో అధిష్టానంతో సమావేశం కానున్నారు ఏపీ నేతలు.. సుమారు 30 మంది ఏపీ కాంగ్రెస్ నేతలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.. తెలంగాణలో విజయం తర్వాత ఏపీ కాంగ్రెస్ పై రాహుల్ గాంధీ దృష్టి పెట్టారు.. ఇటీవల సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కూతురు వైఎస్ షర్మిల భేటీ అయ్యారు.. కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరిక, నిర్వహించనున్న బాధ్యతలపై చర్చించనట్టు తెలుస్తోంది.. “స్టార్ కాంపైనర్”గా షర్మిలకు ఏపీలో బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. ఇక, ఇవాళ్టి భేటీలో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఈ రోజు సమావేశానికి ఏపీసీసీ అధ్యక్షుడు గిడిగు రుద్రరాజు, ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్, సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి, కేవీపీ రామచంద్రరావు, చింతా మోహన్, కొప్పుల రాజు, జేడీ శీలం తదితర సీనియర్ నాయకులు.
పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార
