యాడికి, 26 డిసెంబర్ (హిం.స)
యాడికి మండలం చందన, రాయల చెరువు గ్రామాల్లో రైతుల వ్యవసాయ పొలాలకు సంబంధించిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు దొంగలు ధ్వంసం చేసి, అందులో ఉన్న కాపర్ వైర్లను ఎత్తుకెళ్లారు.
చందన గ్రామంలో నాలుగు, రాయల చెరువులో ఒక విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు ధ్వంసం చేసి అందులో ఉన్న కాపర్ వైర్లను అపహరించారు.
నిన్న అర్థరాత్రి తర్వాత ఈ ఘటనలు చోటుచేసుకున్నట్లు బాధితులు తెలిపారు. ఈ రోజు ఉదయం ఎస్ఐ గురు ప్రసాద్ రెడ్డి కేసు నమోదు చేశారు.
హిందూస్తాన్ సమాచార్,సంధ్యా
