ఢీల్లీ, 25 డిసెంబర్ (హిం.స)
దేశంలో మళ్లీ కరోనా వైరస్ హడలెత్తిస్తోంది. గతంలో ప్రపంచ దేశాలను సైతం అతలాకుతం చేసినా కరోనా.. ఇప్పుడు కొత్తవేరియంట్ భయభ్రాంతులకు గురి చేస్తోంది. కరోనా మళ్లీ చాపకిందనీరులా విస్తరిస్తోంది.
దేశంలో కరోనా డేంజర్ బెల్స్ మోగనే మోగాయి. ఈ కొత్త వేరియంట్ విజృంభిస్తుండటంతో కేసులు నెల రోజుల్లో 52 శాతం పెరిగాయి. అంటే కరోనా కేసులు విజృంభణ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా 8 లక్షల 5 వేలకుపైగా మందికి కరోనా సోకినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇక కరోనాతో లక్ష 18వేల మంది ఆస్పత్రిపాలైయ్యారు.
హిందూస్తాన్ సమాచార్,సంధ్యా
